దేశంలో అతి పెద్ద ప్రభుత్వంరంగ సంస్థ అయిన రైల్వే కొత్త పుంతలు తొక్కుతుంది. అత్యాధునిక సౌకర్యాలతో కేంద్ర ప్రభుత్వం కొత్త రైళ్లను ప్రవేశపెడుతుంది. కొద్ది రోజుల ముందే వందే భారత్ వంటి రైళ్లను ప్రవేశపెట్టి ఓౌరా అనిపించింది. తాజాగా ….దేశంలో 16 బోగీలతో తొలి నమో భారత్ ర్యాపిడ్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 24న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. బిహార్‌లోని జయ్‌నగర్ -పట్నా స్టేషన్ల మధ్య ఈ రైలు సేవలందించనుందని కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది.
దేశంలోనే తొలి నమో భారత్ రైలు గతేడాది సెప్టెంబర్‌లో అహ్మదాబాద్ -భుజ్ స్టేషన్ల మధ్య ప్రారంభమైనప్పటికీ.. అందులో కేవలం 12 కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఎక్కువ మంది ప్రయాణికులకు సేవలందించాలనే ఉద్దేశంతో… కోచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించిన రైల్వే అధికారులు.. తాజాగా 16 కోచ్‌లతో కొత్త రైలును సిద్ధం చేశారు.