HomeCrimeCRIME:యూ టర్న్ తో... జర్మన్ యువతిని ట్రాప్ లోకి

CRIME:యూ టర్న్ తో… జర్మన్ యువతిని ట్రాప్ లోకి

Published on

spot_img

CRIME:యూ టర్న్ తో… జర్మన్ యువతిని ట్రాప్ లోకి

జర్మనీ యువతి అత్యాచార ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు మహ్మద్‌ అబ్దుల్‌ అస్లాం పక్కా పథకం ప్రకారమే యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పహాడీషరీఫ్‌ పోలీసుల తెలిపారు.

ఓ పార్టీ నేత కుమారుడైన అస్లాం మార్చి 31న రంజాన్‌ సందర్భంగా …సెల్ఫ్‌డ్రైవ్‌ కారు తీసుకుని తన కాలనీకి చెందిన బాలురతో నగరంలో తిరిగాడు. మందమల్లమ్మ చౌరస్తా దగ్గర అతడికి జర్మనీ యువతి, ఆమె స్నేహితుడు కనిపించారు. కారులో బాలురతో ఫ్యామిలీమ్యాన్‌లా నటిస్తూ వారిని పరిచయం చేసుకున్నాడు. వారిని కారు ఎక్కించుకొని మామిడిపల్లి గ్రామం సమీపానికి వెళ్లాక మైనర్ లను , యువతి స్నేహితుడిని కారు నుంచి దింపి సెల్ఫీలు తీసుకోవాలని చెప్పాడు. దగ్గరలో యూటర్న్‌ ఉందని… కారు తిప్పుకొస్తామని చెప్పి యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

నిందితుడిని ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల 16 వరకు రిమాండ్‌ విధించింది. నిందితుడి కస్టడీ కోసం పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలు గురువారం జర్మనీ వెళ్లిపోనున్న నేపథ్యంలో రాచకొండ పోలీసులు మంగళవారమే ఆమెను న్యాయమూర్తి దగ్గరికి తీసుకెళ్లి వాంగ్మూలం రికార్డు చేయించారు. ఆమె స్నేహితుడి వాంగ్మూలం కూడా ఇప్పించారు. దీంతో ఈ కేసులో న్యాయమూర్తిని కూడా ఒక సాక్షిగా పరిగణిస్తారు. క్రాస్‌ ఎగ్జామినేషన్‌ అవసరమయితే… వర్చువల్‌ గా బాధితురాలితో మాట్లాడిస్తారని అధికారులు తెలిపారు.

Latest articles

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...

NISSAN: AIతో… డ్రైవర్‌లెస్‌ కార్లు..

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ నిస్సాన్‌ మరికొద్ది రోజుల్లో .... డ్రైవర్‌ లెస్‌ కార్లను తీసుకరావలని భావిస్తుంది. మార్కెట్లో...

More like this