హైదరాబాద్ కు నీటి ప్రధాన్యత తెలిపేలా…హైడ్రా కొత్త లోగోను విడుదల చేశారు. కొత్తగా జలవనరుల శాఖను పోలి ఉండేలా లోగోను రూపొందించింది . హెచ్ అక్షరం హైదరాబాద్ కు గుర్తుగా…నీటి బొట్టు అనగా…నీరు హైదరాబాద్ కు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.
ఇకపై కొత్త లోగోతోనూ హైడ్రా కార్యకలాపాలు కొనసాగించనుంది. హైడ్రా కార్యాలయం, వాహనాలు, సిబ్బంది యూనిఫాంపై కూడా కొత్త లోగో కనిపించనుంది. అలాగే హైడ్రా అధికారిక ట్విట్టర్, (ఎక్స్) అకౌంట్‌కు కొత్త లోగోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టారు.
అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపింది హైడ్రా. ప్రజలను విపత్తుల నుంచి రక్షించడమే కాకుండా.. వారి ఆస్తులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తీసుకొచ్చింది. హైడ్రా వచ్చి కొత్తలోనే తన మార్క్ చూపించింది. నగరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై హైడ్రా పంజా విసిరింది. ఇప్పటి వరకు అనేక అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. చెరువులు, కుంటలపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసింది హైడ్రా. అలాగే అక్రమ నిర్మాణాలపై ప్రజల నుంచి వస్తున్న వినతులపై వెంటనే స్పందిస్తూ.. ముందుగా వారికి నోటీసులు ఇచ్చి.. ఆపై వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోతే…. యాక్షన్‌లోకి దిగుతోంది.