ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ….రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతానికి…సర్కారు బడుల్లో ఒకటో తరగతి నుంచి చదువుకునే అవకాశం ఉండగా… ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నడుస్తున్నాయి. పిల్లలకు మూడేళ్లు నిండగానే తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు ఇష్టపడుతున్నారు. దానివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తామని, పిల్లలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి, టాస్ సంచాలకుడు శ్రీహరి తదితరులు సమావేశమై ప్రీప్రైమరీ తరగతుల గురించి చర్చించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానకి ప్రధాన కారణం ప్రీప్రైమరీ లేకపోవడమే ప్రధాన కారణం కాదు … అనుకున్నంతా ఆంగ్ల మాధ్యంలో బోధన జరుగకపోవడం. ఆగ్లంలో బోధించడానికి ఉపాధ్యాయులకు తగిన శిక్షణ లేకపోవడం కారణంగా తెలుస్తుంది . అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరియైన సౌకర్యాలు లేకపోవడం వంటివి కారణంగా… తెలుస్తుంది. ఎక్కవ మంది ఉపాధ్యాయులు తెలగు మాధ్యంలో చదివి ఉండటం వల్ల ఆంగ్లమాధ్యంలో బొధించడానికి ఇబ్బంది పడటం జరుగుతుంది .
ఆంగ్లంలో బోధించగలిగే ఉపాధ్యాయులను రిక్రూట్ చేసినట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం వుంది. …. 2022-23 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించినప్పటికీ …. అవి సఫలం కాకపోవడానికి ఇవే కారణంగా చెప్పుకోవచ్చు . ప్రీప్రైమరీ తరగతులు లేకపోవడమే ప్రధాన కారణం చెపుతున్నప్పటికీ… అది ముఖ్యకారణం కాకపోవచ్చు ఎందుకంటే..కేంద్రీయ విద్యాలయాల్లో ప్రీప్రైమరీ తరగతులు లేకపోయినప్పటికీ… వాటిలో అడ్మిషన్ లకు ఎక్కువ మంది తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. కేంద్రీయ విద్యాలయాలకు మాదిరిగా … ప్రభుత్వ బడుల్లో ఉపాద్యాయులను నియమించి వాటి నిర్వహణ అదే విధంగా చేపడుతే…ఫలితాలు అవే వస్తాయి.