* ఖంగుతిన్న మత్స్యకారులు
* నెల్లూరు జిల్లా దామరమడుగులో ఘటన
నెల్లూరు జిల్లా: బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలోని వేకూరు కాలువలో ఎప్పటిలాగే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఇవాళ వింత అనుభవం ఎదురైంది. ఉదయాన్నే వేటకు వెళ్లి చేపల కోసం తీవ్రంగా ప్రయత్నించారు.. ఎంత సేపటికీ చేపలు పడకపోవడంతో నిరాశకు గురయ్యారు. కొంత సేపటి తర్వాత వల బరువుగా ఉండటంతో చేపలు బాగా చిక్కాయనుకున్నారు. తీరా బయటకు వల తీస్తే అందులో పెద్ద కొండ చిలువ ఉంది. దాదాపు 15 అడుగులు పొడవున్న ఆ కొండ చిలువను చూడటంతో ఆ మత్స్యకారులు గుండె గుభేల్ మంది. ఎట్టకేలకు దాన్ని ఒడ్డుకు తెచ్చి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఆ కొండ చిలువను తీసుకెళ్లి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.