పనామా కాలువపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాన్ని కచ్చితంగా స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్న ఆయన.. కాలువపై చైనా ప్రభావం లేకుండా చేస్తామన్నారు. మధ్య అమెరికా సందర్శనకు వెళ్లిన హెగ్సెత్, పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినోతో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పనామా కాలువపై చైనా ప్రభావం లేకుండా చర్యలు తీసుకుంటాం. చైనా ఈ కాలువను నిర్మించలేదు. ఆపరేట్ చేయదు. పనామా నాయకత్వంలో దీన్ని సురక్షితంగా.. అన్ని దేశాలకు అందుబాటులో ఉంచుతాము’ అని హెగ్సెత్ పేర్కొన్నారు. ఈసందర్భంగా పనామా బలగాలకు అమెరికా మిలిటరీ భద్రతా సహకారాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. చైనా నుంచి వచ్చే ముప్పును తమ ప్రభుత్వం అర్థం చేసుకుందని హెగ్సెత్ పేర్కొన్నారు.