HomeAndhra PradeshAP Assembly : నేరస్తుల రాజకీయ ముసుగు తొలగిస్తాం: సీఎం

AP Assembly : నేరస్తుల రాజకీయ ముసుగు తొలగిస్తాం: సీఎం

Published on

spot_img

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఇవాళ పలు బిల్లులకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. వైసీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇష్టానుసారం చేయాలనుకుంటే మీ ఆటలు సాగవని హెచ్చరించారు. జగన్ వంటి రాజకీయ నేతను ఇప్పటిదాకా చూడలేదని, రాజకీయ ముసుగులోని నేరస్తులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. నేరస్తుల రాజకీయ ముసుగు తొలగిస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని, పీడీ యాక్ట్ కు కూడా మరింత పదునుపెడుతున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. శిక్ష కఠినంగా ఉంటేనే భయం ఉంటుందన్నారు. ఇసుక, బియ్యం అక్రమ రవాణా చేసినా పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని హెచ్చరించారు. ఇవాళ మళ్లీ హామీ ఇస్తున్నా… రాష్ట్రంలో శాంతిభద్రతలను అమలు చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

“ఇంత చేస్తున్నా నాకు తృప్తి లేదు. ఎందుకంటే… ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవడో ఒకడు విపరీతమైన ధోరణితో ముందుకు వెళ్లి అరాచకాలకు పాల్పడుతున్నారు. ఏదేమైనా ఈ ప్రభుత్వానికి ఒక దృఢ సంకల్పం ఉంది. ఏపీలో లా అండ్ ఆర్డర్ కుదుటపడే వరకు మా పోరాటం ఆగదు” అంటూ చంద్రబాబు తన ప్రసంగం ముగించారు.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this