WATER: మార్చి 22….. ప్రపంచ నీటి దినోత్సవం . .ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జీవరాశులకు నీరే ప్రాణాధారం. నీరు లేనిదే ఏ జీవి జీవించలేదు …మనుగడ సాగించలేదు.. అలాగే ఎర్త్ అవర్ కూడా… ఈ రెండూ ముఖ్యమైన రోజులు ఓకే రోజు రావడం సంతోషంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మానవ జీవితంలో నీరు, విద్యుత్ శక్తి ఎంతో ముఖ్యమైనదని పేర్కొన్నారు. అన్ని జీవరాశులకు నీరే ప్రాణాధారమేని ….భూమే ఏకైక ఇళ్లని, దాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. భూమిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ చేయగలిగినంత సహాయం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఎర్త్ అవర్ సందర్భంగా రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకూ విద్యుత్ ఆపేయాలని చంద్రబాబు సూచించారు. ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు సహా లైట్లు, విద్యుత్ ఉపకరణాలు ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎర్త్ అవర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లమంది ప్రజలను ఏకం చేస్తోందని, అందరూ కలిసి ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
మానవ జీవితంలో నీరు, విద్యుత్ శక్తి ఎంతో ముఖ్యమైనవని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నీరు, విద్యుత్ ను పొదుపు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. వీటి ప్రాముఖ్యతను గుర్తించడం వల్లే నీటి భద్రత, ఇంధన వ్యయ ఆప్టిమైజేషన్ అంశాలను స్వర్ణ ఆంధ్ర-2047 మార్గదర్శక సూత్రాల్లో పొందుపరిచినట్లు చెప్పుకొచ్చారు. వీటిని పొదుపుగా వాడుకోవడం…. స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుందని ఆకాంక్షించారు.
ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందని, కానీ సమష్టి కృషి ఎంతో అవసరమని చంద్రబాబు సూచించారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి ప్రతి ఒక్కరూ… పని చేసినప్పుడు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని చెప్పుకొచ్చారు. ఈ చిన్న పనులే .. రేపటి పెద్దపెద్ద మార్పులకు దారితీస్తాయని, అంతా కలిసి పని చేస్తే గొప్ప మార్పును తీసుకురాగలుగుతామని అన్నారు. ప్రతి ఒక్కరూ నీరు, విద్యుత్ పొదుపు విషయంలో వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.