యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మిస్ యూనివర్స్ (2024) విక్టోరియా తెల్విగ్ దర్శించుకున్నారు. మిస్ యూనివర్స్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అర్చకులు ఆమెకు ఆశీర్వచనం అందించారు. యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్ రావు ఆమెకు సంబంధించిన దర్శనం ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనం అనంతరం ఆమెకు శ్రీవారి ఫొటో, ప్రసాదాన్ని అందించారు. యాదగిరిగుట్ట ఆలయ విశిష్ఠతను, ఆలయ సంప్రదాయం సహా పలు వివరాలను విక్టోరియా అడిగి తెలుసుకున్నారు. ఈవో ఆలయ విశిష్ఠతను మిస్ యూనివర్స్‌కు వివరించారు. అఖండ దీపారాధన అనంతరం విక్టోరియా తెల్విగ్ మీడియాతో మాట్లాడారు. ఆలయ సందర్శన అనిర్వచనీయమని ఆమె పేర్కొన్నారు.