దేశంలో నే కాదు…. రాష్ట్రంలో నిరుద్యోగం ఎంతగా పెరిగిపోయిందో… వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళాను చూస్తే… అర్ధమవుతుంది. పెద్ద ఎత్తున నిరుద్యోగులు రావడంతో తోపులాట జరిగింది. దీన్ని బట్టి మన ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఎంతగా ఉపాధి,
ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నాయో తెలస్తుంది. నిరుద్యోగం తాండవిస్తుంది అనడానికి వరంగల్ లో నిర్వహించిన జాబ్ మేళానే ఒక ఉదహరణ.
జిల్లా రైల్వే స్టేషన్ సమీపంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాలులో జాబ్‌మేళాను మంత్రులు కొండా సురేఖ, సీతక్క ప్రారంభించారు. యువతీ, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. హాలు లోపలికి వెళ్లే క్రమంలో ఉద్యోగార్థులు పోటీ పడటంతో స్వల్పంగా తోపులాట జరిగింది.