హైదరాబాద్: ముషీరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ స్టేడియంలో అప్పుడే పుట్టిన శిశువుకి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించినట్టు స్థానికులు గుర్తించారు. శిశువుకు నిప్పు పెట్టిన సమాచారం తెలియగానే స్థానికులు ఆ ప్రాంతానికి తరలివచ్చారు. సమాచారం అందుకున్న దోమలగూడ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన శిశువు అప్పుడే పుట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏసీపీ గురు రాఘవేంద్ర, దోమలగూడ సీఐ శ్రీనివాసరెడ్డి ఆ శిశువుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.

