HomeAndhra PradeshTML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను......సమయస్పూర్తితో...రక్షించిన తిరుమల పోలీసులు

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

Published on

spot_img

కారు డోర్ లాక్ కావడంతో…. ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది.
వైఎస్సార్‌ జిల్లా బద్వేలుకు చెందిన వెంకటసుబ్బారెడ్డి, సుమలతకు భాను(7), నీల(4) సంతానం. వెంకటసుబ్బారెడ్డి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లగా…సుమలత తన పిల్లలతోపాటు వెంకటసుబ్బారెడ్డి అన్న గంగయ్య, అతని భార్య, అల్లుడు గురువారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం కారులో వచ్చారు . అలిపిరి వచ్చాక సుమలత, గంగయ్య భార్య కాలినడకన తిరుమలకు బయలుదేరగా…
గంగయ్య, ఇద్దరు పిల్లలు, అల్లుడు తిరుమలకు కారులో చేరుకుని… స్థానిక వరాహస్వామి అతిథిగృహం-1 పార్కింగ్‌ ఏరియాలో కారును పార్క్‌ చేశారు. దర్శనానికి ఎలా వెళ్లాలో తెలుసుకునేందుకు పిల్లలను కారులోనే ఉంచి గంగయ్య, అతని అల్లుడు బయటకు వెళ్లారు.
డోర్లు లాక్‌ చేసుకుని వెళ్లడంతో…. కొంతసేపటికి కారులోని పిల్లలు ఊపిరాడక విలపించారు. ఇది గమనించిన ట్యాక్సీ డ్రైవర్లు తిరుమల ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందించడంతో…. వెంటనే కారు అద్దాన్ని పగలగొట్టి చిన్నారులను తితిదే అశ్విని ఆసుపత్రికి తరలించారు. చిన్నారులను ట్రాఫిక్‌ హోంగార్డు జయచంద్ర, పీఎస్‌జీ వెంకటేశ్‌లు వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించి, చిన్నారుల పెదనాన్న గంగయ్యపై ఫిర్యాదు చేశారు.
తన పిల్లలను రక్షించిన పోలీసులకు తల్లి సుమలత ధన్యవాదాలు తెలిపారు.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

JAPAN: పెట్టుబడుల ఆకర్షణే…ధ్యేయంగా….జైకా తో తెలంగాణ ప్రభుత్వం చర్చలు

తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చుకునేందుకూ... తెలంగాణ ప్రభుత్వం జపాన్ ఇంటర్ నేషనల్ కో...

More like this