HomeNationalKamal Haasan: 'హిందీయా'గా మార్చే యోచన!

Kamal Haasan: ‘హిందీయా’గా మార్చే యోచన!

Published on

spot_img

* కేంద్రంపై కమల్ హాసన్ విమర్శలు
* ‘హిందీయా’గా మాకొద్దంటూ తమిళ పార్టీల తీర్మానం

ఇండియాను ‘హిందీయా’గా మార్చాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చూస్తోందని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వం, తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. ఈ అంశంపై కమల్ హాసన్ కూడా స్పందించారు. అన్ని రాష్ట్రాలు హిందీలో మాట్లాడేలా చేసి, ఎన్నికల్లో మెజార్టీ సాధించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మనం ఇండియా గురించి ఆలోచిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం హిందీయా గురించి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా అంశాలపై ఈరోజు తమిళపార్టీలు సమావేశమయ్యాయి. పార్టీలు ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. ఈ సమావేశంలోనే కమల్ హాసన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ 2019లో స్టాలిన్ వాడిన ‘హిందీయా’ పదాన్ని ప్రస్తావించారు. అప్పట్లో, అంతర్జాతీయంగా భారత్ అంటే హిందీ భాష గుర్తుకు వస్తుందని కేంద్రమంత్రి అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. ఆ పోస్టుపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ‘ఇది ఇండియా… హిందీయా కాదు’ అని కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను కమల్ హాసన్ తాజాగా ప్రస్తావించారు.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this