భద్రాచలం: శ్రీరామ నవమి సందర్భంగా… భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో ఈ కల్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులన్నీ రామ నామస్మరణతో మార్మోగాయి. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తన సతీమణి గీతతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ కళ్యాణాన్ని చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ….అధికారులు తగు జాగ్రత్తులు తీసుకున్నారు.