మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా భారీగా గ్యాస్ ధరలు పెరగనున్నాయి. ఎల్పీజీ సిలిండర్‌పై రూ.50 పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఉజ్వల పథకం కింది పొందిన లబ్ధిధారుల సిలిండర్లపైనా రూ.50 పెంచుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నది. అయితే పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమలులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వాస్తవానికి ప్రతి నెలా ఒకటో తేదీన వంట గ్యాస్ సిలిండర్ ధరలు మారుతాయనేది అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా వాణిజ్య సిలిండర్ ధరలను పెంచుతూ… వరుస షాకులు ఇస్తూ వచ్చిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏప్రిల్ 1వ తేదీన గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొత్త రేట్లు ప్రకటించాయి. ఈసారి మాత్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ శుభవార్తను ఆస్వాదించేలోపు మరోవైపు పిడుగులాంటి ప్రకటన విడుదల చేసింది. రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో… సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.