HomeNationalMeerut: పోస్టుమార్టం టైంలో బతికే ఉన్నానంటూ యువకుడి కేకలు!

Meerut: పోస్టుమార్టం టైంలో బతికే ఉన్నానంటూ యువకుడి కేకలు!

Published on

spot_img

* ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటన

* రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు

* చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యుల ప్రకటన

* పోస్టుమార్టం కోసం స్ట్రెచర్‌పై తీసుకెళ్తుండగా కదలిక

మీరట్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చనిపోయాడని భావించిన వైద్యులు పోస్టుమార్టంకు సిద్ధపడగా అతడి కేకలతో ఉలిక్కిపడ్డారు. మళ్లీ ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ మెడికల్ కాలేజీలో జరిగిందీ ఘటన. గోట్కా గ్రామానికి చెందిన షగుణ్‌శర్మ బుధవారం రాత్రి తన సోదరుడితో కలిసి బైక్‌పై ఖతౌలీ వైపు వెళ్తుండగా ఓ వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

షగుణ్‌శర్మ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మీరట్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఏర్పాట్లు చేశారు. స్ట్రెచర్‌పై మార్చురీకి తరలిస్తున్న సమయంలో ‘సార్.. నేను బతికే ఉన్నా’ అని షగుణ్ కేక వేయడంతో వైద్యులు షాకయ్యారు. వెంటనే అతడిని మళ్లీ ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స ప్రారంభించారు. కాగా, ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ విచారణకు ఆదేశించారు.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this