SUNITHA VILLIAMS: సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర..సుఖాంతమైంది. 1.4 బిలియన్ భారతీయుల పూజలు ఫలించాయి. తొమ్మిది నెలల తర్వాత తల్లి గర్భం నుంచి వచ్చి బిడ్డ భూమ్మీదకు వస్తుంది. కానీ 9 నెలల తర్వాత అంతరిక్ష గర్భం నుంచి..సునీత, బుచ్ విల్మోర్ భూమ్మీదకు ల్యాండ్ అయ్యారు. సునీత, బుచ్ విల్మోర్ తో పాటు మరో ఇద్దరు ఆస్ట్రోనాట్‌లతో భూమికి బయల్దేరిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో సురక్షితంగా దిగింది.
కేవలం 8 రోజుల యాత్ర కోసం నిరుడు జూన్ 5న ISSకు వెళ్లిన సునీత, బుచ్ విల్మోర్.. చివరకు ఏకంగా 286 రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక సేఫ్ గా ల్యాండ్ అయిన సునీత, విల్మోర్ లను…..స్ట్రెచర్ పై పెట్టి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు యావత్ ప్రపంచం వారి ఆరోగ్యంపై అంతా ఆరా తీస్తోంది. సో వారి ఆరోగ్యం కుదుట పడేవరకు రీహాబిలిటేషన్ సెంటర్‌లో ఉంచనున్నారు.
డ్రాగన్ వ్యోమనౌక సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వగానే.. సహాయ బృందాలు రంగంలోకి దిగి.. క్రూ డ్రాగన్‌ను వెలికితీస్తాయి. ఆ తర్వాత ఆస్ట్రోనాట్‌లను స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకొచ్చారు.
క్షేమంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక సునీత త్వరలోనే భారత్‌కు వస్తారని ఆమె బంధువు ఒకరు వెల్లడించారు. సునీత క్షేమంగా భూమికి తిరిగిరావడంతో గుజరాత్ లోని ఆమె బంధువులు, స్థానికులు సంబరాలు చేసుకున్నారు.