HomeInternationalEARTHQUAKE:మయన్మార్‌, బ్యాంకాక్‌లో భారీ భూకంపం

EARTHQUAKE:మయన్మార్‌, బ్యాంకాక్‌లో భారీ భూకంపం

Published on

spot_img

శుక్రవారం మయన్మార్‌ లో వరుస భూకంపాలతో ప్రజలు వణికిపోయారు. కేవలం 12 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. రిక్టర్‌ స్కేలుపై 7.7గా నమోదైంది. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో కూడా…రెండుసార్లు తీవ్ర ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్‌లో ప్రకంపనల తీవ్రత 6.4, 7.3గా నమోదైంది. భారత్‌ సహా ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఈ ప్రభావం కన్పించింది.

మయన్మార్‌ లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో… 10 కిలోమీటర్ల లోతున…. భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే గుర్తించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు బ్యాంకాక్‌ లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారమ్‌ మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.

ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. పలు భవంతులు పేక మేడల్లా నేలమట్టమయ్యాయి. ఓ భారీ భవంతి పైఅంతస్తులో ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌లోని నీరు కిందకు పడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రమాద సమయంలో ఆ భవనంలో ఎవరైనా కార్మికులు ఉన్నారా..? శిథిలాల కింద చిక్కుకుపోయారా…? అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే 43 మంది కార్మికులు చిక్కుకున్నట్లు పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. థాయ్‌లాండ్‌ ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

Latest articles

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...

NISSAN: AIతో… డ్రైవర్‌లెస్‌ కార్లు..

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ నిస్సాన్‌ మరికొద్ది రోజుల్లో .... డ్రైవర్‌ లెస్‌ కార్లను తీసుకరావలని భావిస్తుంది. మార్కెట్లో...

More like this