ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని… తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం తన సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్ట్ చేశారు. తెలుగు, కన్నడ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ… అందులో కన్నడిగులను ద్రవిడులుగా పేర్కొనడం వివాదానికి దారితీసింది.
నూతన సంవత్సరాదికి కొత్త ఆశలతో స్వాగతం పలుకుతున్న తెలుగు, కన్నడ మాట్లాడే ద్రవిడ సోదర , సోదరీమణులకు ఉగాది శుభాకాంక్షలు అని తెలియజేశారు. హింది భాష బలవంతంగా.. అమలు , డీలిమిటేషన్ వంటి , రాజకీయ ముప్పుల నేపథ్యంలో ప్రస్తుతం దక్షిణాది మొత్తం ఐకమత్యంతో ఉండటం అత్యవసరమని అన్నారు. మన గుర్తింపును అణగదొక్కే ప్రతి ప్రయత్నాన్ని మనమంతా కలిసి ఓడించాలి. ఈ ఉగాది మన ఐక్యతకు స్ఫూర్తిగా నిలవాలి…. అని స్టాలిన్ ఆదివారం పోస్ట్ పెట్టారు.
డీలిమిటేషన్, బలవంతపు హిందీ అమలుపై మీతో కలిసి పోరాడేందుకు కన్నడిగులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు, కానీ మేం ద్రవిడులం కాదు. అది గుర్తుపెట్టుకోండి. కన్నడ ద్రవిడ భాష కాదు… అని కన్నడ పౌరులు కామెంట్లు చేస్తున్నారు. అటు టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ కూడా దీనిపై స్పందిస్తూ …స్టాలిన్‌పై విమర్శలు గుప్పిస్తూ…. డీఎంకే పార్టీ ద్రవిడ మోడల్ ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు.