HomeAndhra PradeshSOLAR POWER: ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో ...సౌర వెలుగులు

SOLAR POWER: ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో …సౌర వెలుగులు

Published on

spot_img

విద్యుత్ వినియోగాన్ని తగ్గించేంచుకొని ఆదాయం పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందుకు అనుగునంగానే…
చర్యలు చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగంపై అయ్యే ఖర్చును తగ్గించుకునేందుకు మొదటగా ముందడుగు వేసింది.
అందులో భాగంగానే… ఆ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ఎన్‌టీపీసీ విద్యుత్‌ వ్యాపార్‌ నిగమ్‌ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాలపై 300 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టుల నుంచి విద్యుత్‌ తీసుకోవడం వల్ల ఒప్పంద వ్యవధిలో సుమారు రూ.2,957 కోట్లు ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు సంస్థ సర్వే చేసి 496 కార్యాలయాల పరిధిలో సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని గుర్తించింది. వీటి పరిధిలో సుమారు 147 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను మొదటి దశలో ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది.

ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు సగటున రూ.6 నుంచి రూ.8 వరకు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. సౌర విద్యుత్తు వాడితే ఈ మొత్తం సగానికి సగం తగ్గే అవకాశం ఉందని అంచనా. ప్రాజెక్టు వ్యయం, నిర్వహణ ఖర్చులు, రూఫ్‌టాప్‌ వినియోగించుకున్నందుకు ఎన్‌టీపీసీ చెల్లించాల్సిన లీజు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని యూనిట్‌కు చెల్లించే మొత్తాన్ని ప్రభుత్వం నిర్దేశించనుంది. ప్రాథమిక అంచనా ప్రకారం యూనిట్‌ విద్యుత్తు సుమారు రూ.4కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే కరెంటులో భారీగా ఆదా అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా పగటి వేళల్లోనే విద్యుత్‌ వినియోగం ఉంటుంది. ఈ సమయంలో సౌర విద్యుత్‌ను వినియోగించడం వల్ల అందుబాటులో ఉన్న థర్మల్‌ విద్యుత్‌ను పీక్‌ డిమాండ్‌ అవసరాలకు సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కలుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

రూఫ్‌టాప్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ కళాశాలలు, జూనియర్‌ కాలేజీలు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై అందుబాటులో ఉన్న అవకాశాలను ఎన్‌టీపీసీ ఇప్పటికే పరిశీలించింది. కనీసం 150 కిలోవాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు అనువైన ప్రాంతం ఉంటేనే సాధ్యం అవుతుందని తెలిపింది. ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాత కనీసం 50 కిలోవాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్యానళ్ల ఏర్పాటుకు సంస్థ సంసిద్ధత తెలిపింది. ఈ ప్రాజెక్టులను రెస్కో విధానంలో ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు అయ్యే ఖర్చు, 25 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత కూడా ఆ సంస్థ¸ ఈ ఏడాది ఆఖరుకు మొదటి దశ ప్రాజెక్టులను.. మిగిలినవి రెండో దశలోనూ సంస్థ పూర్తిచేస్తుంది.

Latest articles

SUPREME COURT: కంచ గచ్చిబౌలిలో… చెట్లను కొట్టివేసే ముందు అనుమతి ఉందా..?…లేదా..?

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. చెట్లను కొట్టేసే ముందు...

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...

CRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా…!

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా... తృటిలో...

ATM IN TRAINS: రైళ్లో….ఏటీఎం ..!

ఇప్పటి వరకు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద కార్యాలయాల్లో...ఏటీఎం సేవలను వినియోగించుకుంటున్నాం, కానీ త్వరలో కదిలే ఏటీఎంలు కూడా అందుబాటులోకి...

More like this

SUPREME COURT: కంచ గచ్చిబౌలిలో… చెట్లను కొట్టివేసే ముందు అనుమతి ఉందా..?…లేదా..?

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. చెట్లను కొట్టేసే ముందు...

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...

CRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా…!

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా... తృటిలో...