ఆంధ్రప్రదేశ్ లో… మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్‌కార్డులో క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని వెల్లడించారు. కుటుంబసభ్యుల జోడింపు, తొలగింపు, ఆప్షన్లు ఇస్తామన్నారు. ఈ-కేవైసీ పూర్తయితే ఇంకా ఎంతమందికి కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందని చెప్పారు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని…. నచ్చిన మిల్లుకు తీసుకెళ్లి రైతులు ధాన్యం విక్రయించుకోవచ్చని మంత్రి చెప్పారు. వాట్సప్ ద్వారా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు వాట్సప్ ద్వారా 16వేల మంది రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లు తెలిపారు.