యోగ గురువుగా…. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రాందేవ్ బాబా …యోగ అంటే రాందేవ్ బాబా …రాందేవ్ బాబా అంటే యోగ అనేంతగా పేరుతెచ్చుకున్నారు రాందేవ్ బాబా. అలాంటి రాందేవ్ బాబా అప్పుడప్పుడు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతారు. తాజాగా…
షర్బత్ జిహాద్ పేరుతో వీడియో రిలీజ్ చేసి…మరో కొత్త వివాదానికి తెరలేపారు. పతంజలి రోజ్ షర్బత్ ప్రమోషన్ సందర్భంగా…. ఈ వ్యాఖ్యలు చేశారు.
‘షర్బత్ జిహాద్’ఇది.. కూల్‌డ్రింక్స్ పేరుతో… కంపెనీలు అమ్ముతున్నవి మరుగుదొడ్లను శుభ్రం చేసే విషం. ఆ విషం నుంచి మీ కుటుంబాన్ని, అమాయుకులైన పిల్లలను కాపాడండి. పతంజలి షర్బత్, జ్యూస్‌లను మాత్రమే ఇంటికి తీసుకెళ్లండి… అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు.
వేసవిలో దాహాన్ని తీర్చే పానీయాలంటూ ప్రచారం చేస్తోన్న కూల్‌డ్రింక్స్ వాస్తవంగా… అయితే టాయిలెట్ క్లీనర్లు అంటూ విమర్శించారు. వాటిని విషంతో పోల్చారు. అంతేకాక సదరు కూల్‌డ్రింక్స్ కంపెనీలు సాఫ్ట్ డ్రింక్స్ పేరుతో మనకు టాయిలెట్ క్లీనర్‌ని అమ్మడమే కాక.. వాటి మీద వచ్చిన లాభాలతో.. మసీదులు, మదర్సాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇది కూల్‌డ్రింక్స్ పేరుతో జరుగుతున్న షర్బత్ జిహాద్… అని ఆరోపించారు.
జిహాద్‌ల మాదిరే ఈ షర్బత్ జిహాద్ సమాజాన్ని నాశనం చేస్తుంది అన్నారు రాందేవ్ బాబా. అంతేకాక పతంజలి రోజ్ షర్బత్ తాగితే…. అది ఆరోగ్యాన్ని పెంచడమేకాక.. గురుకులాలు, ఆశ్రమాలు, పతంజలి యూనివర్శిటీని నిర్మించేందుకు ఆ డబ్బులు వినియోగిస్తామని రాందేవ్ చెప్పుకొచ్చారు.