* సహకార సంఘాలను బతికించాలని డిమాండ్
కృష్ణాజిల్లా : పెడనలో చేనేత కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేసి ప్రభుత్వానికి నిరసనలు తెలియజేశారు. రాష్ట్ర బడ్జెట్లో 2వేల కోట్ల రూపాయలు కేటాయించాలని, సహకార సంఘాలను బతికించాలని డిమాండ్ చేశారు. దాదాపు 80 ఏళ్ల పై నుంచి చేనేత సహకార సంఘాల ద్వారా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న సొసైటీలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 72 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం చెల్లించకుండా సహకార సంఘాలను నిర్వీర్యం చేస్తున్నదని, దీంతో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు జగన్ ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తామని నమ్మించిన కూటమి ప్రభుత్వం…ఉన్న పథకాలు కూడా రద్దు చేసి చేనేత కుటుంబాలను నిలువునా ముంచిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు కట్టా హేమసుందరరావు, బళ్ల మల్లికార్జున, పేరిశెట్టి ఉమాకాంతం, జాగాబత్తుల ఉమామహేశ్వరరావు, బూసం బాలసుబ్రహ్మణ్యం, పిచ్చుక సోమేశ్వరరావు, కురుమ శ్యాంప్రసాద్, పడవల కోటిలింగం, కుర్మా విఘ్నేశ్వరరావు, బట్ట రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.