HomeAndhra PradeshSea plane : విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సేవలు

Sea plane : విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సేవలు

Published on

spot_img

* నేడు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

* విజయవాడ నుంచి శ్రీశైలంకు సీ ప్లేన్ లో ప్రయాణించిన సీఎం

అమరావతి: ఏపీ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు సీఎం చంద్రబాబు. ఏపీ టూరిజంను కొత్త పుంతలు తొక్కించడంలో భాగంగా ఇవాళ ఆయన సీ ప్లేన్ డెమో లాంచ్ చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులతో కలిసి సీఎం చంద్రబాబు… విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ లో ప్రయాణించారు. శ్రీశైలంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్రీశైలం పర్యటన ముగిసిన అనంతరం… తిరిగి అదే సీ ప్లేన్ లో ప్రయాణించి విజయవాడ చేరుకున్నారు. సీ ప్లేన్ ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా నదిపై ల్యాండైంది.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ టూరిజం పాలసీని ప్రకటిస్తామని చెప్పారు. సీ ప్లేన్ సర్వీసులకు భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నామన్నారు. ల్యాండింగ్, టేకాఫ్ కూడా నేలపై కంటే నీటిలోనే బాగుంటుందని చెప్పారు. రాష్ట్రంలో పర్యాటకానికి అనువైన ప్రదేశాలు ఎన్నో ఉన్నప్పటికీ మార్కెటింగ్ చేసుకోవడంలో మనం విఫలమయ్యామని అన్నారు.

అందమైన ప్రకృతి ఉండే ప్రదేశాల కోసం చాలామంది ఫారెన్ వెళుతున్నారని, ఏపీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తే ఆదాయం పెరుగుతుందని అన్నారు సీఎం చంద్రబాబు. అయితే, గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణపై విజయవాడలో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి జనార్ధన్ రెడ్డి, పౌరవిమానయాన శాఖ అధికారులు కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు.

Latest articles

Earthquake: ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్ప భూకంపం

ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్పంగా భూకంపం సంభవించింది. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో నిన్న (శనివారం)...

సహకార ఉద్యమంలో రాజీలేని పోరుసాగించిన యోధుడు మానం ఆంజనేయులు

* అభినందన సభలో ప్రముఖుల ఉద్ఘాటన హైదరాబాద్ : సహకార ఉద్యమంతో పాటు అనేక కార్మిక పోరాటాల్లో ఎన్నో నిర్భంధాలు,...

Telangana: అరగంటకు పైగా నిలిచిపోయిన రైళ్లు..

హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే వందేభారత్, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుతోపాటు పలు రైళ్లు...

Editorial : బక్కచిక్కుతున్న రూపాయి పాపాయి జనంపై మోయలేని భారం : పదేండ్లుగా పల్తెత్తు మాట్లాడని నరేంద్రమోడీ !!

- ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్. మన జనానికి నిజంగానే మతిమరపు ఎక్కువా లేదా పట్టించుకోవట్లేదా ? కోరి చేసుకున్నోడు గనుక...

More like this