HomeAndhra PradeshVIDADALA RAJINI : విడుదల రజినికి చేదు అనుభవం

VIDADALA RAJINI : విడుదల రజినికి చేదు అనుభవం

Published on

spot_img

పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో… మాజీ మంత్రి విడదల రజినికి చేదు అనుభవం ఎదురైంది. వక్ఫ్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ… చిలకలూరిపేటలో ముస్లింలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. కళామందిర్‌ సెంటర్‌ లో ప్రారంభమైన ఈ ర్యాలీ చౌత్రా సెంటర్‌ వద్దకు రాగానే మాజీ మంత్రి విడదల రజిని అందులోకి ప్రవేశించి కొంత దూరం నడిచారు. ఈ క్రమంలోనే కొందరు ముస్లీంలు అభ్యంతరం తెలిపారు. దాంతో ర్యాలీ నుంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు ఆమెను కోరారు. అన్ని చోట్ల నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి.. పలు పార్టీల నాయకులు పాల్గొంటున్నారు.. చిలకలూరిపేటలో మాత్రమే కాదు కదా…. అని పోలీసులతో రజిని వాగ్వాదానికి దిగారు. ర్యాలీలో పార్టీలకతీతంగా ముస్లింలంతా పాల్గొన్నారు. అందుకే ఒక పార్టీకి చెందిన మిమ్మల్ని వద్దన్నాం… అని రజినికి కొందరు ముస్లింలు తెలిపారు. చేసేదేమీ లేక వైకాపా నాయకులతో ర్యాలీ నుంచి దూరంగా వెళ్లి, అనంతరం విలేకరులతో మాట్లాడి వెళ్లిపోయారు.

Latest articles

CHILD TRAFFICKING: పిల్లల అక్రమ రవాణాదారులు.. హంతకులకంటే ప్రమాదకరం : సుప్రీం కోర్టు

పిల్లల అక్రమ రవాణా విషయంలో... సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడేవారిని చట్టం ముందుంచాలని... అలాంటి...

AMERICA: ట్రంప్‌ కు వ్యతిరేకంగా….ర్యాలీలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు మొదలయ్యాయి. ట్రంప్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ఆరోపిస్తూ......

JAPAN: ఒసాకో ఎక్స్‌పోలో…తెలంగాణ రాష్ట్రం

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా...జపాన్ లో రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతుంది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న రేవంత్...

KARNATAKA: మాజీ డీజీపీ ఓంప్రకాశ్‌ పై కారంపొడి చల్లి… కట్టేసికొట్టి…. హత్య చేసిన భార్య

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ దారుణ హత్య సంచలనం రేకెత్తిస్తుంది. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలే ప్రధాన...

More like this