అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు మొదలయ్యాయి. ట్రంప్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ఆరోపిస్తూ… శనివారం దేశమంతటా నిరసన ర్యాలీలు జరిగాయి. ఆర్థిక రాజధానియైన న్యూయార్క్, పాలనా రాజధానియైన వాషింగ్టన్ తో…సహా పలు నగరాలు, పట్టణాల్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అధ్యక్షుడి నివాస భవనం శ్వేతసౌధం ఎదుటా ఆందోళన కారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
దాదాపు 250 ఏళ్ల కిందట…ఏప్రిల్ 19, 1775లో విప్లవ పోరాటం ప్రారంభమైన రోజునే .. ఈ ఆందోళనలు చేపట్టడం విశేషం. అమెరికన్లపై సొంత ప్రభుత్వమే దాడులు చేస్తోందని, ఐక్యంగా నిలవాల్సిన అవసరముందని ఆందోళనకారులు అన్నారు. మానవ హక్కులు, రాజ్యాంగ ఉల్లంఘనలకు ట్రంప్ పాల్పడుతున్నారని ఆందోళనకారులు నిరసన తెలిపారు.