పెద్దపల్లి జిల్లా: ఆయనెవరో తెలియదు.. అక్కడెందుకు ఉన్నాడో తెలియదు. తప్పిపోయి వచ్చినట్టు మాత్రం తెలిసింది. ఆయన దీనస్థితి చూసి చలించిపోయిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు రాకం శ్రీనివాస్…వెంటనే ఆ వ్యక్తికి నీట్ గా కటింగ్ చేయించి, బట్టలు మార్పించాడు. ఆకలితో అలమటిస్తున్న ఆ వ్యక్తికి అన్నం పెట్టి ఆదరించాడు.
మహారాష్ట్రకు చెందిన ముఖేష్ అనే వ్యక్తి గత మూడు రోజులుగా గోదావరిఖనిలో పోతన కాలనీ వద్ద బస్టాండులో ఉండటాన్ని రాకం శ్రీనివాస్ గమనించాడు. అతనెవరు గుర్తు తెలియని వ్యక్తి కావడంతో స్థానికులు చూసీచూడనట్టుగా వదిలేశారు. ముఖేష్ దీనస్థితి చూసి చలించిన శ్రీనివాస్… ఆయన పట్ల మానవత్వం చాటుకున్నారు. దీంతో రాకం శ్రీనివాస్ ను స్థానికులు అభినందిస్తున్నారు.