POSANI: సినీ నటుడు పోసాని కృష్ణ మురళి గుంటూరు జిల్లా కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు సమర్పించడంతో శనివారం సాయంత్రం బెయిల్‌పై పోసాని బయటకు వచ్చారు. అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన పోసానిని వైసీపీ నేతలు పరామర్శించారు.
గత కొన్ని రోజుల నుంచి పోసాని గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. శుక్రవారం ఆయనకు గుంటూరులోని సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో శనివారం ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. అయితే మార్చి 23వ తేదీ వరకు పోసాని రిమాండ్‌లో ఉండాల్సి ఉంది. సీఐడీ అధికారులు ఒక రోజు ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించారు. మరోసారి తమకు విచారణ నిమిత్తం అప్పగించాలని కోర్టును కోరారు. కానీ, ఈ లూపే కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.
చార్జిషీటు దాఖలు చేసే వరకు గుంటూరు సీఐడీ రీజినల్ ఆఫీసులో రెండు వారాలకోసారి హాజరు కావాలని సీఐడీ కోర్టు షరతు పెట్టింది. పోలీసులు పిలిచినప్పుడు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే, పోసానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా చాలా చోట్ల కేసులు నమోదై ఉన్నాయి.
గుంటూరు జైలు నుంచి
బెయిల్‌పై విడుదలైన పోసాని కృష్ణమురళి#PosaniKrishnaMurali #guntur #AndhraPradesh #appolice pic.twitter.com/lT09n8H56A— Masineni Lalitha (@Lalitha_Rama15) March 22, 2025