HomeCrimeCRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా...!

CRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా…!

Published on

spot_img

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా… తృటిలో ప్రాణాపాయం నుంచి విద్యార్థులు భయటపడ్డారు. విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా చల్లారు. సిబ్బంది అప్రమత్తతతో స్కూల్‌లోని 30 మంది విద్యార్థులకు పెను ముప్పు తప్పింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం, ఆదివారం సెలవులు రావడంతో సిబ్బంది పాఠశాలలో వంట గదికి తాళం వేసి వెళ్లారు. సోమవారం ఉదయం వంట చేసేందుకు పాత్రలు కడిగే సమయంలో చెడు వాసన, నురగలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది చుట్టూ చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది. తాగు నీటి ట్యాంకులోనూ దాన్ని కలిపినట్లు వారు గుర్తించారు. విద్యార్థులను తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు. మధ్యాహ్న భోజనం వండలేదు. ఈ ఘటనపై పాఠశాల హెచ్‌ఎం ప్రతిభ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విషయం తెలిసిన స్థానికులు దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఇంత ఘాతుకానికి పాల్పడ్డ వారిని
తక్షణమే పట్టుకొవాలని….దీన్ని గమనించిన స్కూల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు పిల్లల తల్లిదండ్రులు

Latest articles

WEATHER: తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

ఇవాళ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

GURUGRAM: ఐసీయూలో ఉన్న ఎయిర్‌ హోస్టెస్‌పై లైంగిక దాడి

అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఓ ఎయిర్ హోస్టెస్ కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందిస్తుండగా...ఆసుపత్రి సిబ్బందిలో...

SUPREME COURT: కంచ గచ్చిబౌలిలో… చెట్లను కొట్టివేసే ముందు అనుమతి ఉందా..?…లేదా..?

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. చెట్లను కొట్టేసే ముందు...

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...

More like this