HomeInternationalPETRO,DIESEL:ఊగిసలాటలో పెట్రోల్, డీజిల్ ధరలు.....

PETRO,DIESEL:ఊగిసలాటలో పెట్రోల్, డీజిల్ ధరలు…..

Published on

spot_img

PETRO,DIESEL:ఊగిసలాటలో పెట్రోల్, డీజిల్ ధరలు…..

దేశవ్యాప్తంగా…. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు రూ. 2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచింది. దీనివల్ల సాదారాణంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి. ఈ పెరిగిన ధ‌ర‌లు ఇవాళ అర్ధ‌రాత్రి నుంచి అమ‌ల్లోకి రానున్నాయి అని కేంద్ర ఒక ప్రకటనలో వెల్లడించినప్పటికీ….మరో వైపు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలలో ఎలాంటి పెరుగుదల ఉండ‌ద‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు రిటైల్ ధరల్లో మార్పులు చేయవద్దు అని ఆయిల్ కంపెనీలకు కేంద్రం సూచించింది. దీంతో ధరలు పెరుగుతాయా….? లేదా అనేది చూడాలి మరి….

పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ పెంపు వల్ల ప్ర‌భుత్వ‌ ఖజానాకు అదనపు ఆదాయాన్ని చేకూరుస్తుంది అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ. 13కి పెరిగింది. డీజిల్‌పై లీటరుకు రూ. 10కి పెరిగింది. ఇంధనంపై ఎక్సైజ్ సుంకం అనేది దేశంలోని వస్తువుల తయారీ లేదా ఉత్పత్తిపై కేంద్ర ప్రభుత్వం విధించే పరోక్ష పన్ను. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి లేదా దిగుమతి సమయంలో చమురు మార్కెటింగ్ కంపెనీల నుంచి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఆదాయవనరుగా చెప్పుకోవచ్చు. ప్రపంచ చమురు ధరలలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు, ట్రంప్ ప్ర‌తీకార‌ సుంకాల మధ్య ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకోవ‌డం చర్చకు దారి తీసింది.

Latest articles

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...

NISSAN: AIతో… డ్రైవర్‌లెస్‌ కార్లు..

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ నిస్సాన్‌ మరికొద్ది రోజుల్లో .... డ్రైవర్‌ లెస్‌ కార్లను తీసుకరావలని భావిస్తుంది. మార్కెట్లో...

More like this