HomeAndhra PradeshCRIME NEWS: పాస్టర్‌ ప్రవీణ్‌ మద్యం తాగి బైక్‌ నడిపాడు : ఐజీ

CRIME NEWS: పాస్టర్‌ ప్రవీణ్‌ మద్యం తాగి బైక్‌ నడిపాడు : ఐజీ

Published on

spot_img

పాస్టర్‌ ప్రవీణ్ మృతిపై అనేక విధాలుగా దర్యాప్తు చేపట్టినట్లు ఐజీ అశోక్‌ కుమార్‌ కీలక విషయాలు తెలిపారు. ప్రవీణ్‌ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారు. మాట్లాడిన వ్యక్తుల నుండి సమాచారం తీసుకున్నాం. సీసీటీవీ ఫుటేజ్‌ లను పరిశీలించాం. ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయనప్పటికీ… సోషల్‌ మీడియాలో తలోరకంగా మాట్లాడారు కానీ ఎలాంటి ఆధారాలూ ఇవ్వలేదు. సోషల్‌ మీడియాలో చెప్పినవన్నీ నిరాధార ఆరోపణలేనని…. ఆయన హైదరాబాద్, కోదాడ, ఏలూరులో మద్యం దుకాణాలకు వెళ్లారు. దారిలో ఆయనకు చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి.

ప్రవీణ్‌ దారిలో ఆరుసార్లు యూపీఐ పేమెంట్లు చేశారు. ఆయన శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక చెప్పింది. కీసర టోల్‌ప్లాజా వద్ద ఆయన అదుపుతప్పి కింద పడిపోయారు. సాయం చేసేందుకు అంబులెన్స్‌, వైద్య సిబ్బంది వెళ్లారు. రామవరప్పాడు జంక్షన్‌ వద్ద ప్రవీణ్‌ పరిస్థితిని ఆటో డ్రైవర్‌ చూశారు. ట్రాఫిక్‌ ఎస్సై సూచనతో పార్కులో రెండు గంటలు నిద్రపోయారు. కండిషన్‌ బాగోలేదు, వెళ్లవద్దని చెప్పినా ఆయన వినలేదు. హెడ్‌లైట్‌ పగిలిపోవడంతో రైట్‌సైడ్‌ బ్లింకర్‌ వేసుకునే ప్రయాణించారు.

ఏలూరులో ఆయన మద్యం కొనుగోలు చేశారు. మద్యం దుకాణానికి వచ్చినప్పటికే ప్రవీణ్‌ కళ్లజోడు పగిలిపోయి ఉంది. కొంతమూరు వంతెనపై కూడా ఆయన వేగంగా వెళ్లారు. ప్రమాదం జరిగిన స్థలంలో బుల్లెట్‌ వాహనం రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఆయన బుల్లెట్‌ను ఏ వాహనం కూడా ఢీకొనలేదు. బైక్‌కు, పక్కన వెళ్తున్న కారుకు చాలా గ్యాప్‌ ఉంది. ప్రమాద స్థలంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. కంకర రాళ్లు ఉన్నాయి. బుల్లెట్‌ పైకి ఎగిరి పాస్టర్ ప్రవీణ్‌పై పడిందని ఫోరెన్సిక్‌ నివేదిక చెప్పింది. ప్రమాదం జరిగినప్పుడు బండి ఫోర్త్‌గేర్‌లో ఉంది. ఇతర వాహనాలను ఢీకొనలేదని ఫోరెన్సిక్‌ నిపుణులు స్పష్టం చేశారు… అని ఐజీ అశోక్‌ కుమార్ తెలిపారు.

Latest articles

Bhu Bharathi: ఎంతో అధ్యయనం చేసి కాంగ్రెస్ భూచట్టాలను చేసింది..!

*'ధరణి' ఎన్నో సమస్యలకు కారణమైంది.. *భూభారతి పోర్టల్‌ను ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన ధరణి చట్టం...

Dr.BR Ambedkar: బి.ఆర్.అంబేద్కర్ కు ఘన నివాళులు..

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ (Dr....

Hyderabad: జైలులోపలికి ఫోన్…ఖైదీతో మాట్లాడిన విడియో… సోషల్ మీడియాలో వైరల్ ..

హైదరాబాద్ నగరానికి చెందిన అహ్మద్ బిన్ హసన్ అల్ జాబ్రీ అనే యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ...

PADI KAUSHIK REDDY: గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో కుంభకోణం

గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కోఠి కళాశాలలోని 18, 19వ సెంటర్లలో 1,490 మంది పరీక్షకు హాజరుకాగా, 74 మంది...

More like this