దేశంలో నే మొట్టమొదటి సారిగా …. అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానంతో రూపొందిన వర్టికల్ లిఫ్ట్… రైల్వే సీ బ్రిడ్జి ప్రారంభానికి ముస్తాబైంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో నిర్మించిన… ఈ పాంబన్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 6న జాతికి అంకితం చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12.45 సమయంలో ప్రధాని పాంబన్ నుంచి రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీయనుంది.