HomeAndhra PradeshDr.Mallu Ravi: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు సరికాదు..!

Dr.Mallu Ravi: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు సరికాదు..!

Published on

spot_img

* రాహుల్ ప్రధాని కావడం ఖాయం
* నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి

హైదరాబాద్ : మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ మాట్లాడిన విధానాన్ని తప్పుబట్టారు నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి. రాహుల్ గాంధీ దేశంలో సమర్ధవంతంగా నాయకత్వ లక్షణాలతో పనిచేస్తున్నారని, రాహుల్ ప్రధాని కావడం ఖాయమని డాక్టర్ మల్లు రవి పేర్కొన్నారు. మీడియాకు ఓ విడుదల చేసిన ఎంపీ మల్లు రవి… రాహుల్ గాంధీ ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాకుండా ఇండియా కూటమి పార్టీలకు నాయకుడన్నారు. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారన్నారు. పార్లమెంటులో అన్ని అంశాలలో రాహుల్ గాంధీ దేశ ప్రజల గొంతును వినిపిస్తున్నారని చెప్పారు. భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్రలు చేపట్టి దేశ ప్రజల హృదయాలను రాహుల్ గాంధీ అర్థం చేసుకున్నారని అన్నారు. దేశాన్ని ఏకతాటిపై ఉంచేందుకు జోడో యాత్ర జరిపారన్నారు. పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా… డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ను అవమానపరిచిన అంశంపై మొదటిసారిగా స్పందించింది కూడా రాహుల్ గాంధీనేనని, అమిత్ షా భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది కూడా రాహుల్ అన్న విషయాన్ని ఎంపీ డాక్టర్ మల్లు రవి గుర్తు చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని డాక్టర్ మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు.

Latest articles

Allu Arjun: అల్లు అర్జున్ కు భారీ ఊరట… రెగ్యులర్ బెయిల్ మంజూరు

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో షరతులతో కూడిన...

Telangana : సహ విద్యార్థినికి విషెస్ చెప్పినందుకు దాడి…మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తోటి విద్యార్థినికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని ఆగ్రహించిని అమ్మాయి...

AP Cabinet : కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని...

Earthquake: ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్ప భూకంపం

ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్పంగా భూకంపం సంభవించింది. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో నిన్న (శనివారం)...

More like this