శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తమిళ జాలర్లను వెంటనే విడుదల చేయాలని, వారి పడవలను విడిచిపెట్టాలని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ను కోరారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కారించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే…. అని తమిళనాడు ప్రభుత్వం పలుమార్లు వెల్లడించిన నేపధ్యంలో…. శ్రీలంక పర్యటనలో ఉన్న మోడీ ఈ అభ్యర్థన చేసారు. కచ్ఛతీవు వద్ద రాష్ట్ర జాలర్లు చేపలు పట్టేందుకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. తమ రాష్ట్ర మత్స్యకారులను భారతీయ జాలర్లుగా కేంద్రం చూడాలన్నారు. జాలర్ల అంశంపై 2010 తర్వాత భారత్ – శ్రీలంక మధ్య చర్చలు జరుగలేవన్నారు.