కొత్తగూడెం మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లొంగిపోయిన మావోయిస్టులంతా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారని తెలిపారు. వీరిలో 66 మంంది పురుషులు, 20 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న…ఆపరేషన్ చేయూత…. కార్యక్రమంలో భాగంగా వీరంతా లొంగిపోయినట్లు ఐజీ పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద రూ. 25 వేలు అందజేయనున్నట్లు తెలిపారు.