HomeNationalJAPAN: ఒసాకో ఎక్స్‌పోలో...తెలంగాణ రాష్ట్రం

JAPAN: ఒసాకో ఎక్స్‌పోలో…తెలంగాణ రాష్ట్రం

Published on

spot_img

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా…జపాన్ లో రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతుంది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సోమవారం ఉదయం భారత పెవిలియన్లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ప్రారంభించారు . ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఒసాకో ఎక్స్పో నిర్వహిస్తారు. ఒసాకో ఎక్స్‌పోలో పాల్గొన్న మన దేశంలోని తొలి రాష్ట్రం తెలంగాణ కావటం విశేషం. ఒసాకా ఎక్స్‌పో వేదికపై తెలంగాణ తన వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు మరియు పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలాల నుంచి వచ్చే సందర్శకులకు చాటిచెప్పే విధంగా నిర్వహించనుంది. తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు…. సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. .

Latest articles

CHILD TRAFFICKING: పిల్లల అక్రమ రవాణాదారులు.. హంతకులకంటే ప్రమాదకరం : సుప్రీం కోర్టు

పిల్లల అక్రమ రవాణా విషయంలో... సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడేవారిని చట్టం ముందుంచాలని... అలాంటి...

AMERICA: ట్రంప్‌ కు వ్యతిరేకంగా….ర్యాలీలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు మొదలయ్యాయి. ట్రంప్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ఆరోపిస్తూ......

VIDADALA RAJINI : విడుదల రజినికి చేదు అనుభవం

పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో... మాజీ మంత్రి విడదల రజినికి చేదు అనుభవం ఎదురైంది. వక్ఫ్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌...

KARNATAKA: మాజీ డీజీపీ ఓంప్రకాశ్‌ పై కారంపొడి చల్లి… కట్టేసికొట్టి…. హత్య చేసిన భార్య

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ దారుణ హత్య సంచలనం రేకెత్తిస్తుంది. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలే ప్రధాన...

More like this