JANASENA:త్రిభాషా విధానంపై తమిళనాడు ప్రభుత్వం గట్టిగా పోరాడుతోంది. అందుకు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ను తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2026 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పూనర్విభజనను అంగీకరించడం లేదు. ఇదే విషయమై జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకు స్టాలిన్ సిద్ధమవుతున్నారు. ఇందుకోసం దక్షిణాది రాష్ట్రాల ప్రజా ప్రతినిధుల మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగానే శనివారం చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ హాజరయ్యారు .
ఈ మేరకు చెన్నైలో సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన డీలిమిటేషన్ మీటింగ్‌కు జనసేన నేతలు హాజరయ్యారైనట్లు జరుగుతున్న ప్రచారంపై….. ఆ పార్టీ స్పందించారు. డీలిమిటేషన్ కు జనసేన తరపును ఎవరూ హాజరుకాలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా లేఖ విడుదల చేశారు. అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. ఈ సమావేశంలో జనసేన నుంచి ఎవరు హాజరుకాలేదని తెలిపారు.
అయితే డీలిమిటేషన్ మీటింగ్ కు ఆహ్వానం అందిందని….కానీ వేర్వేరు కూటముల్లో ఉండటం వల్ల పాల్గొనడం కూదరదన్న తమ అధినేత పవన్ సూచన మేరకు సమాచారం ఇచ్చినట్లు జనసేన పేర్కొంది. ఇక డీలిమిటేషన్ పై వారికి ఒక అభిప్రాయం ఉన్నట్లే, తమకు ఓ విధానం ఉందని, ఈ విషయాన్ని సరైన వేదికపై వెల్లడిస్తామని లేఖలో పేర్కొన్నారు.