HomeAndhra PradeshRAMAGIRI SI: స్థాయి మరిచి మాట్లాడిన జగన్...కౌంటర్ ఇచ్చిన ఎస్ ఐ

RAMAGIRI SI: స్థాయి మరిచి మాట్లాడిన జగన్…కౌంటర్ ఇచ్చిన ఎస్ ఐ

Published on

spot_img

తాను అధికారంలోకి వస్తే…. పోలీసుల బట్టలూడదీస్తానని వ్యాఖ్యానించిన మాజీ సీఎం జగన్‌కు శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను మంగళవారం రాత్రి ఆయన విడుదల చేశారు. జగన్‌… పోలీసులను బట్టలూడదీసి కొడతానంటున్నారా…? పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకున్నారనుకున్నారా…? కష్టపడి చదివి, పరుగు పందెల్లో పాసై.. వేలాదిమంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇది. మీరు వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు. మేం నిజాయతీగానే ప్రజల పక్షాన నిలబడతాం. నిజాయతీగానే ఉద్యోగం చేస్తాం. నిజాయతీగానే చస్తాం తప్ప.. అడ్డదారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి… అంటూ జగన్‌ను హెచ్చరించారు. గతనెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని.. అయినా ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని వివరించారు.

Latest articles

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

More like this