మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో…కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఊహాగానలకు తెరదించారు. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. జిల్లాలో దశాబ్దకాలం ఒంటరిగా పోరాటం చేశానన్నారు. కాంగ్రెస్ అంటే జీవన్‌రెడ్డి….. అనే విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేశానని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్‌లో వీహెచ్ తర్వాత తనే సీనియర్ అని…, జానారెడ్డి కూడా తనకంటే… నాలుగేళ్ల తర్వాత వచ్చారని… పార్టీలో సీనియార్టీకి స్థానం ఏమిటనే బాధ నాలో ఉందని తెలిపారు. కొందరు సీనియర్లు వారి అభిప్రాయాలతో మాట్లాడి ఉండొచ్చు…అని అసహనం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి.