హైదరాబాద్: ఐపీఎల్ 2025 ప్రారంభం కానుండటంతో రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 23న ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మ్యాచ్ కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 2,700 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు.ఉప్పల్ స్టేడియంలో 450 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏసీపీ ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షించనున్నారు. అలాగే స్టేడియం ఎంట్రన్స్ వద్ద స్నిపర్ డాగ్స్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేయనున్నారు.
ఇక క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే మహిళల కోసం మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేశారు.స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ల్యాప్ టాప్, అగ్గిపెట్టెలు, పలు ఎలక్ట్రానిక్ వస్తువుల అనుమతికి నిరాకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.ఐపీఎల్ మ్యాచ్ ఉన్న రోజుల్లో నగరంలో అర్ధరాత్రి వరకూ మెట్రోరైళ్లు నడుస్తాయి.