భారత్-పాక్ సరిహద్దు వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాయాది దేశ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.
ఏప్రిల్ 1న కృష్ణ ఘాటి సెక్టార్ వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడింది. అక్కడ మందుపాతర పేలిన ఘటన చోటుచేసుకుంది. తరువాత పాక్ సైన్యం నియంత్రణ రేఖ లోపలికి వచ్చి కాల్పులు జరపడంతో….భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. ఇందులో నలుగైదుగురు ముష్కరులు మరణించినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని భారత సైన్యం వెల్లడించింది.