* టీడీపీ ఆధ్వర్యంలో మహిళలతో అర్ధనగ్న ప్రదర్శన
* పోలీసులు తీరుపై మండిపడుతున్న గ్రామస్తులు
ఏపీలోని తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం మదివేడు దండు మారెమ్మ జాతరలో అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి. స్థానిక టీడీపీ నాయకుడు వై.జి.సురేంద్ర ఆధ్వర్యంలో ఆ జాతర ముసుగులో మహిళలతో అసభ్య నృత్యాలు చేయించారు. పబ్లిక్ గా మహిళలు అర్ధనగ్న నృత్యాలు చేస్తున్నా పోలీసులు చూసీచూడనట్టుగా వ్యవహరించారు. ఆ జాతరకు పోలీసులు దగ్గర ఉండి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే, గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని గ్రామస్తులు చెబుతున్నారు. జాతరకు కుటుంబాలతో వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, అక్కడ భక్తి లేదని, రక్తి మాత్రమే కనిపించిందని స్థానికులు మండిపడుతున్నారు.
It's really a shame, @JaiTDP @ncbn @naralokesh@PawanKalyan 🤡🤷♂️🤷♂️
Are you guys sleeping @APPOLICE100 ??
తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం మదివేడు దండు మారెమ్మ జాతరలో అశ్లీల నృత్యాలు కలకలం
జాతర ముసుగులో అసభ్య నృత్యాలు
మహిళలతో అర్ధనగ్న నృత్యాలు చేయించిన టిడిపి నాయకులు… pic.twitter.com/GsRvaMgcpA— 🆈 🆂 🆁 🅲 🅿 🆂 🅼 2.0 (@BerrySmile112) March 22, 2025