మధ్యప్రదేశ్‌లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. సోదాల సందర్భంగా మూడు మొసళ్లను గుర్తించిన అధికారులు అవాక్కయ్యారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే హర్వాన్ష్ సింగ్ రాథోడ్ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐటీ అధికారులు అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో రాథోడ్ ఇంట్లోని చెరువులో మూడు మొసళ్లను అధికారులు గుర్తించారు.
మాజీ ఎమ్మెల్యే ఇంట్లో మొసళ్లు ఉండటంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే, హర్ష్వాన్ సింగ్ రాథోడ్ రూ.155 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. రాథోడ్ నివాసంలో రూ.3 కోట్ల నగదుతో పాటు కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను గుర్తించారు.