ఇటీవలే విడుదలైన…. మలయాళ సినిమా ఎల్ 2: ఎంపురాన్ లోని కొన్ని సన్నివేశాలపై వివాదం నెలకొనడంతో… దర్శక, నిర్మాతలు మరోసారి సెన్సార్ బోర్డును ఆశ్రయించారు. దీంతో సెన్సార్ బోర్డు.. పలు సన్నివేశాలకు సంబంధించి 24 కట్స్ చెప్పింది. కొన్ని చోట్ల ఆడియో మ్యూట్ చేయాలని, కొన్ని పేర్లు మార్చాలని, కొన్ని విజువల్స్ తీసేయాలని, కొన్ని రీప్లేస్ చేయాలని సూచించింది. రివైజ్డ్ వెర్షన్ ఎప్పటి నుండి ప్రదర్శితమవుతుందన్న వివరాలు ఇంకా టీమ్ ప్రకటించలేదు.
మోహన్‌లాల్ హీరోగా…. పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 27న విడుదలైంది. హిట్ మూవీ ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా రూపొందడంతో ఆ అంచనాలు అందుకున్నా.. మరోవైపు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఇందులో కీలక సన్నివేశాలుగా చూపించడం అందుకు కారణం. నాలుగున్నర రోజుల్లోనే ఈ సినిమా రూ.200+ కోట్లు వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది.