ప్రజాస్వామ్యంలో పాలన కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా సాగుతుందని, న్యాయస్థానాల వల్ల కాదన్నారు. ఎందుకంటే
ప్రభుత్వం…. పార్లమెంటుకు, దానిని ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారీ అని వివరించారు.
రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే సభ్యురాలు కనిమొళి ఎన్‌వీఎన్ సోమూ మాట్లాడుతూ.. జాతీయ అర్హత పరీక్ష ‘నీట్’ను వికేంద్రీకరించాలని డిమాండు చేశారు. దీనిని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోసిపుచ్చారు. గతంలో దీనిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. , కేంద్రీకృత విధానాన్ని న్యాయస్థానం కూడా సమర్థించిందన్నారు. ఈ క్రమంలోనే జోక్యం చేసుకున్న ఛైర్మన్….. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పాలన కేవలం కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారానే సాగుతుందన్నారు. ఎందుకంటే..
ఎగ్జిక్యూటివ్ అనేది పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుందన్నారు.