వైకాపా ప్రభుత్వ హయాంలో ఎండీయూ(రేషన్ డోర్ డెలివరీ) వాహనాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆయా సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలు లేవని తెలిపారు. గత ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యవస్థ కారణంగా.. రాష్ట్రంలో పేదల బియ్యం ఎటు వెళ్ళాయో… ఎంత వెళ్ళిందో… తెలియని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికీ ఒక్కో వాహనానికి నెలకు రూ.27 వేలు చెల్లిస్తున్నామని తెలిపారు.