HomeAndhra PradeshKA Paul: 9 నెలలకే చాప్టర్ క్లోజ్... అంతా అవినీతిమయం!

KA Paul: 9 నెలలకే చాప్టర్ క్లోజ్… అంతా అవినీతిమయం!

Published on

spot_img

* నేను చెప్పినట్టే పవన్ కల్యాణ్ చేశాడు…

* వర్మకు బుద్ధి లేదు: కేఏ పాల్

మళ్లీ జనసేన గానీ, టీడీపీ గానీ గెలుస్తాయా? 9 నెలలకే చాప్టర్ క్లోజ్… అంతా అవినీతిమయం!… అంతటా విఫలమయ్యారని స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఈసారి వచ్చేది కేవలం ప్రజాశాంతి పార్టీ మాత్రమే” అని వ్యాఖ్యానించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంపై ఆయన స్పందించారు. తాను చెప్పినట్టే పవన్ కల్యాణ్ చేశాడని, ఎమ్మెల్సీని తన అన్న నాగబాబుకు ఇచ్చుకున్నాడని అన్నారు. గత ఎన్నికల సమయంలో, నువ్వు పోటీ చేయకుండా పవన్ కు సహకరించు అని వర్మకు చెప్పారని, ఎమ్మెల్సీ నీకే ఇస్తామని దేవుడి సాక్షిగా హామీ ఇచ్చారని కేఏ పాల్ పేర్కొన్నారు.

“ఆ వర్మ ఏమో… అయ్యా మీ మాట నిలబెట్టుకోండంటూ అమరావతిలో పవన్ కల్యాణ్ చుట్టూ, చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాడు. బుద్ధుందా వర్మా… వాళ్లు మాట నిలబెట్టుకోరని అప్పుడే చెప్పాను కదా. పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు అట… ఈ మధ్యనే జనసేనలో చేరాడు. నాకర్థం కావడంలేదు. మీకు బుద్ధి, బుర్ర ఉన్నాయా… ఇదే పవన్ కల్యాణ్, చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి వందల కోట్లు, వేల కోట్లు వసూలు చేశారని మనందరం విన్నాం… కొందరు సూసైడ్ కూడా చేసుకున్నారు. అదే ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనగా ఆవిర్భవించిందని అదే చిరంజీవి చెబుతున్నారు. అంటే దానర్థం ఏంటి…? అదే పాలసీతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ మేం వందలు, వేల కోట్లు వసూలు చేస్తాం… మా కుటుంబం మాత్రం పదవులు అనుభవిస్తాం… అంటున్నారు. తెలివైనవాడు ఎవడూ ఆ పార్టీలో చేరడు. మూర్ఖులు మాత్రమే అందులో చేరతారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కేఏ పాల్.

Latest articles

Peace rally : ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ

* పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్‌లో...

Pakistan High Commission : ఢిల్లీలోని పాక్ హైకమిషన్ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు?

* ఓ వ్యక్తి కేక్ తీసుకెళ్తుండగా ప్రశ్నించిన మీడియా * పాక్ ఎంబసీలో అధికారులు సెలబ్రేషన్స్ జరుపుకున్నారా? అని అనుమానం దేశ...

VINAY NARWAL: పెళ్ళయిన ఆరు రోజులకే…. హృదయ విదారక ఘటన

హృదయవిదారక ఘటన...పెళ్లయి ఆరు రోజులే... కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ నవజంటపై ఉగ్రదాడి పంజావిసిరింది. ఏకాకిగా...

HYDRAA LOGO: నీటిబొట్టుతో… హైడ్రా లోగో

హైదరాబాద్ కు నీటి ప్రధాన్యత తెలిపేలా...హైడ్రా కొత్త లోగోను విడుదల చేశారు. కొత్తగా జలవనరుల శాఖను పోలి ఉండేలా...

More like this