అంతర్జాతీయ పరిణామాలతో… దేశీయ మార్కెట్లో గరిష్ఠానికి చేరిన బంగారం ధర బుధవారం కాస్త తగ్గింది. 10 గ్రాముల పుత్తడి ధర దాదాపు రూ.3వేలు తగ్గింది. 11 గంటల సమయంలో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,700గా ఉంది. అటు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.98,720గా ఉంది.
నేడు రూ.96,500 వద్ద ప్రారంభమైన ఈ ధర.. ఇంట్రాడేలో రూ.95,457 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్ లోనూ.. ఔన్సు బంగారం ధర 3,320.40 డాలర్లుగా ఉంది. నిన్న ఈ ధర 3,467 డాలర్లు దాటింది.
చైనాతో… వాణిజ్యానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు చేయడంతో… అగ్రరాజ్య మార్కెట్లు లాభాలను దక్కించుకున్నాయి. డాలర్ విలువ కూడా బలపడుతోంది. ఈ పరిణామాలన్నీ బంగారం ధరపై ప్రభావం చూపించాయని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 30న అక్షయతృతీయ నాటికి బంగారం ధరలు తగ్గకపోతే అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు.