రతన్ టాటా …ఒక వ్యాపార ధిగ్గజం, దాతృత్వ దాత, మానవతా మూర్తి , పరోపకారి , దేశానికి ఎప్పుడు ఆపద వచ్చిన
నేనున్నానంటూ ముందుకు వచ్చిన ఆపద్భాంధవుడు.
ఆయన రాసిన వీలునామాలో తన ఆస్తుల్లో సింహభాగాన్ని దాతృత్వానికే కేటాయించారు. మిగిలిన దాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు చెందేలా రాశారు. ఆస్తిలో సింహభాగాన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్టులకు కేటాయించారు. బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్టాక్స్, ఇతర విలువైన వాటితో కలిపి మొత్తం రూ.3800 కోట్ల ఆస్తుల్లో మూడో వంతును తన సవతి తల్లి కుమార్తెలు షిరీన్ జేజీబాయి, డియాన్నా జేజీబాయికి రతన్ టాటా ఇచ్చారు.
రతన్ టాటాకు పెంపుడు జంతువులంటే ప్రాణం. అది ఆయన వీలునామాలో కనిపించింది. తన పెంపుడు జంతువుల కోసం ఆయన రూ.12 లక్షలను కేటాయించారు. తద్వారా ఒక్కో పెంపుడు జంతువుకు 3 నెలలకోసారి రూ.30,000 అందుతాయి.