హైదరాబాద్: సీపీఐ(ఎంఎల్) నేత, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఎట్టకేలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం లభించడం లేదంటూ గత 15 రోజులుగా గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని కలవడానికి పలుసార్లు వెళ్లినప్పటికీ గేటు వద్దే తనను ఆపేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో సీఎం అపాయింట్‌మెంట్ లభించడంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఇవాళ ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి గుమ్మడి నర్సయ్య ఒక లేఖను అందజేశారు. మాజీ ఎమ్మెల్యేను రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు.
CPI (ML) party senior leader and former MLA Gummadi Narsaiah called on #Telangana chief minister @revanth_anumula at the Assembly here on Tuesday.
A few weeks ago, Narsaiah expressed his ire over not being able to get an appointment with #RevanthReddy. Moreover,… pic.twitter.com/XI2ibr97v8
— NewsMeter (@NewsMeter_In) March 18, 2025